29 ఏళ్లకే రిటైర్‌మెంట్  ఇలా షాక్ ఇచ్చాడేంటి!

విండీస్ విధ్వంసకారుడు నికోలస్ పూరన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు.

ఎంతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని పూరన్ అన్నాడు. ఇన్నాళ్లూ తనకు మద్దతుగా నిలిచిన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపాడు.

క్రికెట్ ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలను ఇచ్చిందన్నాడు ఎల్‌ఎస్‌జీ స్టార్.

పొట్టి ప్రపంచ కప్‌-2026కు 8 నెలల ముందు పూరన్ రిటైర్‌మెంట్ ప్రకటించడం ఏంటని అభిమానులు షాక్ అవుతున్నారు.

వెస్టిండీస్ తరఫున 61 వన్డేల్లో 1,983 పరుగులు చేశాడు పూరన్. 106 టీ20ల్లో 2,275 పరుగులు చేశాడీ విధ్వంసక బ్యాటర్.

2016లో పాకిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో డెబ్యూ ఇచ్చిన పూరన్.. చివరగా 2024 డిసెంబర్ 19న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆడాడు.