పంత్‌లా ఆడాలని ఉంది..  రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పించ్ హిట్టర్ రిషబ్ పంత్‌‌లా తనకు బ్యాటింగ్ చేయాలని ఉందన్నాడు స్లైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్.

తమ ఇద్దరి గేమ్‌లో కొన్ని సారూపత్యలు ఉన్నాయని కేఎల్ తెలిపాడు. బ్యాటింగ్ చేయడం ఇద్దరికీ ఇష్టమని చెప్పుకొచ్చాడు.

పంత్‌తో బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తానని.. అతడి ఆటను దగ్గర నుంచి గమనిస్తూ ఉంటానని రాహుల్ పేర్కొన్నాడు.

పంత్‌లా తనకు బ్యాటింగ్ చేయాలని ఉందని.. అలాంటి షాట్లు కొట్టాలని కలలు కంటానని రాహుల్ వివరించాడు.

పంత్ హిట్టింగే కాదు.. డిఫెన్స్ కూడా అదుర్స్ అని మెచ్చుకున్నాడు స్టైలిష్ బ్యాటర్.

రిషబ్ డిఫెన్స్‌ను ఛేదించడం ప్రత్యర్థి బౌలర్లకు చాలా కష్టమన్నాడు.

పంత్ ఎప్పుడు గేర్లు మార్చి, అగ్రెసివ్‌గా ఆడతాడో అంచనా వేయలేమన్నాడు రాహుల్.