కాటేరమ్మ కొడుకుల్లో ఒకడు మిస్..  కోచ్ లెక్క కరెక్టే..

సీఎస్‌కేతో విజయంతో తిరిగి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది ఎస్‌ఆర్‌హెచ్. 

టీమ్ విజయం సాధించినా కోచ్ డానియల్ వెటోరి అంతగా హ్యాపీగా లేడు. 

కాటేరమ్మ కొడుకులు అంతా రాణిస్తున్నా.. జట్టులో ఒకడు లేని లోటు కనిపిస్తోందని చెప్పాడు. 

లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆర్ సాయి కిషోర్ సన్‌రైజర్స్‌లో ఉంటే అదిరిపోయేదని వెటోరి అన్నాడు. 

జీటీ తరఫున రాణిస్తున్న సాయి కిషోర్‌ను ఆక్షన్‌లో సొంతం చేసుకునేందుకు ప్రయత్నించామని తెలిపాడు. 

బంతిని టర్న్ చేయడం, పర్ఫెక్ట్ లెంగ్త్‌లో విసురుతూ బ్యాటర్లను తికమెక పెట్టడంలో సాయి దిట్ట అని మెచ్చుకున్నాడు వెటోరి. 

సాయి కిషోర్ కోసం వేలంలో ప్రయత్నించామని.. ఆర్టీఎం కార్డు వాడి జీటీ అతడ్ని దక్కించుకుందన్నాడు. 

సాయి కిషోర్ లాంటి క్వాలిటీ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఉంటే సన్‌రైజర్స్ బౌలింగ్ అటాక్ అదిరిపోయేదని నెటిజన్స్ అంటున్నారు.