145 ఏళ్లలో ఇదే తొలిసారి..  డబ్ల్యూటీసీ ఫైనల్‌లో క్రేజీ రికార్డ్!

ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా జరుగుతోంది. ఇరు జట్లు నువ్వా నేనా అంటూ తలపడుతున్నాయి.

ఈ మ్యాచ్ తొలి రోజు ఏకంగా 14 వికెట్లు నేలకూలాయి. ఇదే క్రమంలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.

ఈ పోరు తొలి ఇన్నింగ్స్‌ల్లో రెండు టీమ్స్ (మొదటి బ్యాటర్) నుంచి ఒక్కో ఓపెనర్ డకౌట్ అయ్యారు. 145 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్‌లో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్.

ఓవరాల్‌గా చూసుకుంటే.. టెస్టుల్లో ఇప్పటివరకు 10 సార్లు ఇలా జరిగింది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకు ఆలౌట్ అయింది.

తొలి రోజు ఆట ముగిసేసరికి సౌతాఫ్రికా తమ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది.

రెండో రోజు ప్రొటీస్ బ్యాటర్లు ఎలా ఆడతారనే దాని మీదే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.