పూజ గదిలో అగ్గిపుల్లలు ఉంచితే ఏమవుతుందో తెలుసా..

దేవుని గది చాలా పవిత్రమైన ప్రదేశం. ఇది దేవుడిని పూజించడానికి కాకుండా ..ఇంట్లోకి శుభ శక్తిని ఆకర్షించడంలో దోహదపడుతుంది.

దేవుని గదిలో ఏ వస్తువులు ఉండాలి, ఏవి ఉండకూడదనే అంశంపై వాస్తు నిపుణులు స్పష్టమైన సూచనలు చేస్తున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం.. పూజ గదిలో అగ్గిపుల్లలు ఉంచడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.

అగ్గిపుల్ల అంటే నిప్పు. పూజ గది అనేది ఆధ్యాత్మిక శక్తులతో నిండిన ప్రశాంతమైన ప్రదేశం. అందువల్ల, ఆ ప్రదేశంలో అగ్గిపెట్టె ఉంచడం వల్ల ఆ శక్తులలో అసమతుల్యత ఏర్పడే ప్రమాదం ఉందని అంటున్నారు.

వంట గది నిప్పును ఉపయోగించే ప్రదేశం కాబట్టి వంట గదిలో అగ్గిపుల్లలు ఉంచడం మంచిదని సూచిస్తున్నారు.

వాస్తు ప్రకారం పూజ గదిలో అగ్గిపెట్టె పెడితే ఇంట్లో ఆర్థిక సమస్యలు తప్పవని వాస్తు, జ్యోతిశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు.

పూజ గదిలో అగ్గిపెట్టె ఉంచాల్సిన అత్యవసర పరిస్థితి ఉంటే.. దానిని ఒక గుడ్డలో చుట్టి కనిపించకుండా ఉంచాలంటున్నారు.

పూజ గదిని దక్షిణ దిశలో ఉంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఉత్తరం లేదా తూర్పు దిశలో మాత్రమే ఉంచాలని చెబుతున్నారు.

దీపం వెలిగించిన తర్వాత ఉపయోగించిన అగ్గిపుల్లలను పక్కన పెట్టడం దురదృష్టానికి సంకేతంగా పరిగణించబడుతుందని అంటున్నారు.