దేవుడు మేల్కొనేది కర్పూరంతోనే

భగవంతునికి భక్తునికి మధ్య అగర్బత్తీ ఎంతమేరకు అనుసంధాన కర్తతెలియదుగానీ

కర్పూరం మాత్రం తప్పకుండా వారిద్దరి మధ్య వారధినే! 

దేవుడికి సమర్పించిన తర్వాత భక్తులు కళ్లకు అద్దుకుంటేనే దర్శనం సంపూర్ణమైనట్టు లెక్క!

ఆలయం తలుపులు తెరుచుకున్న తర్వాత స్వామి నిండుగా మేల్కొనేది "కర్పూర హారతి"తోనే.

భక్తులు సైతం స్వామికి హారతిచ్చిన అనంతరం తాము స్వీకరిస్తేనే దేవుడి ఆశీస్సులు తమకు లభించినట్టుగా భావిస్తారు.

కర్పూరం వెలిగించినప్పుడు వచ్చే సువాసనతో భక్తుల మనసుల్లో ప్రశాంతత ఉద్భవిస్తుంది.

భగవంతుని సన్నిధిలో ఉన్నామనే భావనకు, ఈ సువాసనతోడై మనశ్శాంతిని మరింతగా పెంచుతుంది

కర్పూరం దైవారాధనకే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది