హనుమాన్ జయంతి రోజు..  ఈ నియమాలు తప్పక పాటించండి..

తెల్లవారుజామున నిద్ర లేవాలి. ముందుగా స్నానం చేసి దుస్తులు ధరించాలి. ఇది ఆధ్యాత్మిక, శారీరక స్వచ్ఛతను సూచిస్తుంది.

హనుమంతుని ఆశీర్వాదం పొందడానికి.. హనుమాన్ చాలీసా పఠించాలి. దీనిని 11 లేదా 108 సార్లు పఠించడం శుభప్రదంగా పరిగణిస్తారు.

హనుమాన్ ఆలయంలో దండలు, సింధూరంతోపాటు లడ్డూలు తదితర ప్రసాదాల రూపంలో పంచి పెట్టాలి.

ఈ రోజు..చాలా మంది అనుచరులు ఉపవాసం ఉంటారు. పండ్లు,పాలు మాత్రమే ఆహారంగా తీసుకుంటారు.

రామాయణంలోని సుందర కాండ భాగాన్ని చదవడం వల్ల అనుగ్రహం కలుగుతోంది.

ఈ రోజు.. హనుమాన్ విగ్రహం లేదా ఆయన చిత్రాల ముందు ఆగరబత్తులు, నూనె దీపాలు వెలిగించాలి.

ఆపదలో ఉన్న వారికి ఆహారం,దుస్తులు లేకుంటే నగదు ఇవ్వండి. ఎందుకంటే ఇతరులకు సహాయం చేయడం ద్వారా హనుమంతుడికి అత్యంత ప్రీతిపాత్రం.