కొబ్బరికాయ కొట్టినప్పుడు  కుళ్లిపోతే దేనికి సంకేతం

మనం ఇంట్లో పూజ చేసినప్పుడు లేదా దేవాలయాలకు వెళ్లినప్పుడు కొబ్బరికాయలను కొడుతుంటాం.

హిందూ సంప్రదాయం ప్రకారం భగవంతుని పూజలైనా, ఇంట్లో శుభకార్యాలు అయినా కొబ్బరికాయ కొట్టనిదే పూజ పూర్తి కాదు.

పూజల్లో భాగంగా టెంకాయను కొట్టినప్పుడు పువ్వు వచ్చినా, కుళ్లిపోయినా అశుభానికి సంకేతమా

కొబ్బరికాయకు 3 కన్నులు ఉంటాయి. దీనికి శాస్త్రంలో ఒక ప్రత్యేకత ఉంది

అలాంటి కొబ్బరికాయను దేవుని నైవేద్యంగా సమర్పించే క్రమంలో ఒక్కోసారి టెంకాయ కుళ్లిపోవచ్చు లేదా అందులో పువ్వు కనిపించొచ్చు.

శుభకార్యాల సమయంలో పువ్వు కనిపిస్తే ఇంట్లోకి పసిబిడ్డ రాబోతున్నదనీ, త్వరలోనే బారసాల చేస్తారనే నమ్మకం కూడా ఉందని చెబుతున్నారు.

కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయ కుళ్లిపోయినా అశుభమేమీ కాదంటున్నారు. అలా కుళ్లిపోవడం "శుభసూచకం" అని కూడా అంటారని చెబుతున్నారు