శుక్రవారం నాడు ఉపవాసం ఉండి  లక్ష్మీ దేవిని ఇలా పూజించాలి.

హిందూమతంలో లక్ష్మీదేవికి ఒక విశిష్టమైన స్థానం ఉంటుంది. లక్ష్మీదేవిని సంపదలకు దేవతగా అందరూ పూజిస్తూ ఉంటారు.

మాతా లక్ష్మి అనుగ్రహంతో ఇల్లు మరియు వ్యాపార ఖజానా నిండుగా ఉంటుంది. లక్ష్మీ దేవిని సంపదల దేవత అని కూడా అంటారు

లక్ష్మీ దేవి ఆరాధనకు రాత్రి వేళ పవిత్రమైనదిగా పరిగణిస్తారు. శుక్రవారం రోజున రాత్రి 9 నుంచి 10 గంటల మధ్యలో లక్ష్మీ దేవిని పూజించాలి. 

ఈ పవిత్రమైన రోజున ఉతికిన బట్టలను ధరించి, ఎర్రని వస్త్రంపై అమ్మవారి ఫొటో లేదా విగ్రహాన్ని ఉంచాలి.

అదే విధంగా శ్రీ యంత్రాన్ని ఉంచాలి. ముందుగా నెయ్యి దీపాన్ని వెలిగించాలి. అష్ట గంధాన్ని శ్రీ యంత్రం, లక్ష్మీ దేవికి తిలకంగా పెట్టాలి.

పదలకు దేవత అయిన లక్ష్మీ దేవి శాశ్వత నివాసం కావాలంటే.. ఈశాన్యంలో పూజా స్థలాన్ని నిర్మించాలి

 లక్ష్మీదేవిని తూర్పు దిక్కున కూర్చోబెట్టి పూజించాలి ప్రార్థనా స్థలం దగ్గర వంటగది లేదా మరుగుదొడ్డి ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.