నిద్రలేచిన వెంటనే వీటిని చూస్తున్నారా..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉదయం నిద్రలేచిన వెంటనే చేయకూడని పనులు, చూడ కూడని వస్తువులు కొన్ని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే మొదట చూసే వస్తువుల ప్రభావం ఆ రోజంతా ఉంటుందని వాస్తు నిపుణులు అంటున్నారు.

చాలా మందికి ఉదయం లేవగానే అద్దంలో ముఖం చూసుకోవడం లేదా జుట్టు దువ్వుకోవడం అలవాటుగా ఉంటుంది.

ఉదయం లేచిన వెంటనే మురికి పాత్రలు కనిపించకూడదు. ఇది ప్రతికూలతను పెంచడమే కాకుండా పేదరికాన్ని కూడా తెస్తుందని వాస్తు నిపుణులు భావిస్తున్నారు

ఉదయం నిద్రలేచిన వెంటనే మీ నీడ లేదా ఇతరుల నీడ కనిపించడం మంచిది కాదు. కనిపిస్తే జీవితంలో అశాంతి, ఒత్తిడి పెరుగుతాయి.

ఆగిపోయిన గ‌డియారాన్ని చూడ‌కూడ‌దు. చూస్తే  రోజంతా  నెగిటివ్ ఎన‌ర్జీ పెరుగుతుందట.

నిద్ర‌లేచిన వెంట‌నే చెత్త‌ బుట్ట‌ను చూడ‌కూడ‌దు. చెత్త‌బుట్ట‌ను చూస్తే రోజంతా ప‌లు స‌మ‌స్య‌లు వెంటాడుతాయ‌ట.

ఉద‌యం నిద్ర‌లేచిన వెంట‌నే వన్యప్రాణుల చిత్రాలను చూడడం కూడా వాస్తు ప్రకారం అనర్ధాలకు దారితీస్తుందని చెబుతున్నారు.