కేటీఆర్‌కి కేంద్రమంత్రి
బండి సంజయ్
స్ట్రాంగ్ వార్నింగ్
మాజీ మంత్రి కేటీఆర్ గురించి ఎంపీ సీఎం రమేష్ చెప్పింది వాస్తవమని బండి సంజయ్ తెలిపారు.
మాజీ సీఎం కేసీఆర్ మొదట కేటీఆర్‌కు టికెట్ ఇవ్వలేదని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
సిరిసిల్లలో కేటీఆర్‌కు మొదట టికెట్ ఇప్పించింది ఏపీ ఎంపీ సీఎం రమేష్ అని గుర్తుచేశారు.
సీఎం రమేష్ వల్లే కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారని
బండి సంజయ్ తెలిపారు.
రమేష్ సవాల్‌కు కేటీఆర్ సిద్ధమా అని ప్రశ్నించారు.
ప్లేస్ ఎక్కడో చెప్పు..రమేష్‌ను నేను తీసుకొస్తానని కేటీఆర్‌కి బండి సంజయ్ సవాల్ చేశారు.
కేటీఆర్ ఇప్పటికైనా తన భాషని మార్చుకోవాలని హితవు పలికారు.
యూట్యూబ్ చానల్స్ పెట్టుకుని కేటీఆర్ హద్దులు మీరుతున్నారని ధ్వజమెత్తారు.
కేటీఆర్ తన భాష మార్చుకోకపోతే తమ ప్రతాపం చూపిస్తామని బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలు అవాస్తవమని బండి సంజయ్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ అంటే.. బిడ్డా, అల్లుడు, కొడుకు, అయ్యా పార్టీ అని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ నడవడం కష్టమని తెలిపారు.
Related Web Stories
అమరావతిలో మళ్లీ సింగపూర్ నిర్మాణాలు..
హంద్రీ నీవాకు నీరు విడుదల చేసిన చంద్రబాబు..
ఒక్క ప్రూఫ్ చూపించండి.. అజిత్ డోభాల్ చాలెంజ్!
కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో పీటీఏం 2.0 కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్