దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసు
నిందితులకు ఉరిశిక్ష
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
ఈ కేసులో దోషులు వేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది.
ఈ కేసులో ప్రమేయం ఉన్న ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ ట్రయల్ కోర్ట్ ఇచ్చిన తీర్పును సమర్థించింది.
జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధతో కూడిన ధర్మాసనం.. దోషులందరికీ ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది.
కాగా.. 2013, ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో వరుస బాంబు పేలుళ్ల కేసుపై ఎన్‌ఐఏ సుదీర్ఘంగా విచారణ జరిపింది.
ఈ కేసులో ఏ2 అసదుల్లా అక్తర్ ( యూపీ), ఏ3జియ ఉర్ రహమాన్ ( పాకిస్థాన్), ఏ4 మహమ్మద్ తహసీన్ అక్తర్ హాసన్ ( బీహార్ ),
ఏ5 మహమ్మద్ యాసిన్ భత్కల్, ఏ6 అజాజ్ షేక్ సమర్ అర్మాన్ (మహారాష్ట్ర) ఉన్నారు.
అయితే ప్రధాన దోషి అయిన రియాజ్ భత్కల్ అలియాస్ మహమ్మద్ రియాజ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు.
Related Web Stories
ప్రధాని మోదీ ప్రారంభించిన పాంబన్ వంతెన ప్రత్యేకతలివే..
అమరవీరుల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకొంటారు..
దేశంలో అత్యంత పేద ఎమ్మెల్యేలు వీరే
దేశంలో సంపన్న ఎమ్మెల్యేలు వీరు.. సీఎం చంద్రబాబు స్థానం ఇదే..