అధికారాల బదిలీ..  చైనాలో అసలు ఏం జరుగుతోంది?

చైనా ప్రెసిడెంట్ షీ జిన్‌పింగ్ తన అధికారాలను బదిలీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

జీవితకాలం పాటు అధికారంలో సాగేలా కమ్యూనిస్టు పార్టీ రాజ్యాంగాన్ని సవరించిన జిన్‌పింగ్.. ఇప్పుడా విషయంలో వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

అధికారాలను ఒక్కొక్కటిగా తదుపరి నేతలకు జిన్‌పింగ్ బదిలీ చేస్తున్నట్లు వినిపిస్తోంది.

త్వరలో జిన్‌పింగ్ పదవీ విరమణ చేయడం ఖాయమని వార్తలు వస్తున్నాయి.

జూన్ 30న జరిగిన పార్టీ సమావేశంలో అధికారాల బదిలీపై ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపారని సమాచారం.

జిన్‌పింగ్ కావాలనే తన సహచరులకు కొత్త బాధ్యతలు అప్పగిస్తున్నారని.. ఇతర పెద్ద అంశాల మీద ఫోకస్ చేసేందుకు ఇలా చేస్తున్నారనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.

ఒకవేళ జిన్‌పింగ్ పదవి నుంచి దిగిపోతే డ్రాగన్ కంట్రీకి కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎంపిక అవుతారనే డిస్కషన్స్ ఊపందుకున్నాయి.