మల్యాల వద్ద హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం నుంచి మూడు పంపుల ద్వారా నీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
ఈరోజు మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద పూజలు నిర్వహించిన అనంతరం స్విచ్ఛాన్ చేసి హంద్రీ - నీవా కాల్వలకు నీటిని విడుదల చేశారు సీఎం.
ప్రజాప్రతినిధులతో కలిసి జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు.
అనంతరం ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించిన సీఎం.
ఆపై మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని ముఖ్యమంత్రి సందర్శించారు.
శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు వివిధ కాల్వలకు.. రిజర్వాయర్లకు విడుదల చేసిన నీటిని సక్రమంగా వినియోగించుకునేలా ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని సీఎం సూచించారు.
తిరుపతి వద్ద గాలేరు - నగరి, హంద్రీ - నీవా, సోమశిల - స్వర్ణముఖి కలిసేలా ప్రణాళికలు చేసుకోవాలని సీఎం ఆదేశించారు.
సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.