మీ పెత్తనం అవసరం లేదు..
ట్రంప్‌కు బ్రెజిల్ అధ్యక్షుడి కౌంటర్!
ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదంటూ డొనాల్డ్ ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చారు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డిసిల్వా.
దునియా ఒకప్పటిలా లేదని.. ఇప్పుడు ఏ చక్రవర్తి అవసరం లేదని లూయిజ్ ఇనాసియో స్పష్టం చేశారు.
బ్రిక్స్ దేశాలు సార్వభౌమత్వాన్ని కలిగి ఉన్నాయని.. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదన్నారు.
ట్రంప్ సుంకాలు జారీ చేస్తే ఇతర దేశాలూ అదే పని చేస్తాయంటూ వార్నింగ్ ఇచ్చారు లూయిజ్ ఇనాసియో.
సుంకాల పేరుతో ప్రపంచ దేశాలను బెదిరించడం సరికాదని, దీనిపై మాట్లాడేందుకు చాలా వేదికలు ఉన్నాయని పేర్కొన్నారు.
బ్రిక్స్ ఎవరికీ హాని చేయదని.. అయితే ఇక్కడ రాజకీయాలు అవసరం చేయడం సరికాదన్నారు.
అమెరికా విధానాలకు వ్యతిరేకంగా ఏ దేశమైనా బ్రిక్స్‌కు మద్దతు ఇస్తే.. 10 శాతం సుంకాలు విధిస్తామంటూ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
Related Web Stories
ఈ స్కూల్ చూస్తుంటే అసూయగా ఉంది.. లోకేష్
ప్రజల ముందుకు ఖమేనీ.. ఎట్టకేలకు బాహ్య ప్రపంచంలోకి!
KTR: రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
అప్పటివరకు బతుకుతా.. దలైలామా ఆసక్తికర వ్యాఖ్యలు!