కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో పీటీఏం 2.0 కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్

శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మెగా పీటీఏం 2.0 సమావేశానికి విద్య శాఖ మంత్రి నారా లోకేష్‌తో కలిసి సీఎం చంద్రబాబు హాజరయ్యారు.

చదువుకునిపైకి వచ్చిన వారు స్కూళ్లకు ఎంతోకొంత చేయూత ఇవ్వాలని సీఎం చంద్రబాబు పిలుపు నిచ్చారు.

విద్యా వ్యవస్థను అద్భుతంగా నిర్వహిస్తున్న మంత్రి లోకేష్‌ను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అభినందించారు.

చదువు విషయంలో మహిళలకు పెద్ద పీట వేశానని తెలిపారు.

ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం పథకం ద్వారా నగదు ఇచ్చే బాధ్యత తనదన్నారు.

విద్య శాఖను నారా లోకేష్ ఏరి కోరి మనస్ఫూర్తిగా తీసుకున్నారన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదని స్పష్టం చేశారు.

లీప్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఎవరైనా స్కూల్‌కు విద్యార్థులు డుమ్మా కొడితే పదిన్నర గంటలకే పేరంట్స్‌‌కు సందేశం వెళ్తుందన్నారు.

పిల్లలకు ఎకరా రెండు ఎకరాలు ఆస్తి ఇవ్వడం కాదని.. వారిని బాగా చదివిస్తే కుటుంబం, సమాజం బాగుపడుతుందని తల్లిదండ్రులకు సీఎం చంద్రబాబు సూచించారు.