ఆరు జోన్లు.. రెండు మల్టీ జోన్‌లకు కేబినెట్ ఆమోదం

రాష్ట్రంలో 26 జిల్లాలకు కేంద్రం జారీ చేసిన ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్ 2025 గెజిట్ అమలు.. గెజిట్‌లో ప్రచురణకు ఏపీ కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేస్తే ఇప్పటివరకు ఉన్న పబ్లిక్ ఎంప్లాయి‌మెంట్ ఆర్డర్-1975 రద్దవుతుంది.

కొత్తగా 26 జిల్లాలు, ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లు అమల్లోకి వస్తాయి. ఉద్యోగ నియామకాలు, బదిలీలకు దీనినే ప్రామాణికంగా తీసుకుంటారు. 

స్థానికతకు ఇప్పటివరకు ఉమ్మడి 13 జిల్లాలను ప్రామాణికంగా తీసుకొగా.. కొత్త గెజిట్ అమల్లోకి వస్తే 26 జిల్లాలను తీసుకుంటారు. రాష్ట్రస్థాయి పోస్టులు ఇక మల్టీజోన్ కేడర్‌లోకి వస్తాయి.  

మల్టీ జోన్‌లోకి వచ్చేవి.. జోన్ 1: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి. జోన్ 2: అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ. జోన్ 3: పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా.

మల్లీ జోన్ 2లోకి వచ్చేవి.. జోన్ 4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు. జోన్ 5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప. జోన్ 6: నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీసత్యసాయి