ఒక్క ప్రూఫ్ చూపించండి..
అజిత్ డోభాల్ చాలెంజ్!
ఆపరేషన్ సిందూర్ టైమ్‌లో భారత్ చేసిన దాడులకు ప్రతిగా పాకిస్థాన్ కూడా మన దేశం మీద అటాక్ చేసింది.
పాక్ ప్రతిదాడులను సమర్థంగా తిప్పికొట్టిన ఇండియా.. ఆ దేశానికి మూడు చెరువుల నీళ్లు తాగించింది.
పాక్ చేసిన దాడుల్లో భారత్‌కు నష్టం కలిగిందంటూ విదేశీ మీడియా దుష్ప్రచారం చేస్తోంది. దీనిపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సీరియస్ అయ్యారు.
భారత్‌కు నష్టం కలిగిందనే విషయాన్ని నిరూపించేందుకు ఒక్క ఆధారాన్ని అయినా చూపాలని చాలెంజ్ చేశారు.
భారత్‌కు నష్టం కలిగినట్లు ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదని.. మన ఆయుధ స్థావరాల మీద దేశ సైన్యం చిన్నగీతా పడనివ్వలేదన్నారు ఢోబాల్.
భారత క్షిపణులు పాక్ భూభాగాల లోపలి వరకూ వెళ్లి శత్రుదేశ వైమానిక స్థావరాలను తీవ్రంగా దెబ్బతీశాయని డోభాల్ పేర్కొన్నారు.
పాక్ సైన్యం ప్రయోగించిన ఫతేహ్-11 మిసైల్స్‌ను ఎస్-400 సాయంతో మధ్యలోనే పేల్చేశామన్నారు.
Related Web Stories
కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో పీటీఏం 2.0 కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్
మీ జోక్యం అక్కర్లేదు.. అమెరికాకు చైనా వార్నింగ్!
మీ పెత్తనం అవసరం లేదు.. ట్రంప్‌కు బ్రెజిల్ అధ్యక్షుడి కౌంటర్!
ఈ స్కూల్ చూస్తుంటే అసూయగా ఉంది.. లోకేష్