ఆగస్టు మొదటి ఆదివారం  స్నేహ దినోత్సవాన్ని జరుపుకుంటారు

అన్ని బంధాలను దేవుడిస్తే.. మనిషి తనకు తానుగా ఏర్పాటు చేసే బంధం స్నేహం బంధం.

నిజమైన ఒక్క స్నేహితుడి ఉంటే చాలు జీవితంలో కష్టం నష్టం అన్న మాటే ఉండదు అని అంటారు.

జీవితంలోని ప్రతి సుఖ దుఃఖ సమయంలో నిలబడే వ్యక్తులు స్నేహితులు మాత్రమే.

చిన్నతనంలో ఆటల్లో కాలేజీలో, ఆఫీసు కబుర్లు ససమయంలోని, జీవిత పోరాటంలో  ఎవరైతే మనతో అడుగడుగునా అండగా ఉంటారో అతడే మనకు నిజమైన స్నేహితుడు.

స్నేహం వయస్సును, భాషను, కులాన్ని చూడదు.

ఎందుకంటే అది హృదయాలతో ఏర్పడే సంబంధం మాత్రమే.

స్నేహం అంటే ఎటువంటి స్వార్థం లేకుండా ఒకరి కోసం నిలబడటం, చెప్పకుండానే ఒకరి బాధను అర్థం చేసుకోవడం..

ఎటువంటి నటన లేకుండా ఒకరినొకరు అంగీకరించడం. అందుకనే సృష్టిలో స్నేహానికన్న మిన్న లోకానా లేదురా అన్నాడో సినీ కవి.