కొన్ని ఉద్యోగాలు భద్రతతో పాటు సౌకర్యాన్ని కూడా అందిస్తాయి.
ఇంకొన్ని ఉద్యోగాల్లో భద్రత ఉండదు. ప్రాణాంతక వాతావరణాల్లో పనిచేయాల్సి వస్తుంది. అలాంటి డేంజరస్ జాబ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
మైనింగ్ నిపుణులు:
బొగ్గు గనులతో పాటు ఇంకొన్ని పనుల్లో లోతైన భూగర్భంలోకి వెళ్లి ప్రమాదకర పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది.
అగ్నిమాపక సిబ్బంది:అగ్నిమాపక సిబ్బంది తీవ్రమైన వేడి, పొగ, విషపూరిత వాయువులను కాచుకొని ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.
ఇనుము-ఉక్కు కార్మికులు:ఈ కార్మికులు భవనాలు, వంతెనలు, టవర్ల ఉక్కు చట్రాలను నిర్మిస్తారు. వీళ్లు తరచుగా ఎత్తైన ప్రదేశాల్లో పని చేస్తారు.
నిర్మాణ కార్మికులు:నిర్మాణ కార్మికులు యంత్రాలను నడుపుతారు. అలాగే భారీ వస్తువులను ఎత్తడంతో పాటు ప్రమాదకరమైన ఎత్తుల్లో పని చేస్తుంటారు.
పైకప్పులు:పైకప్పులపై పని చేయడం కూడా ప్రమాదకరమే. ఇలాంటి కార్మికులు రూఫర్లు, నివాస, వాణిజ్య భవనాలపై రూఫింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసి మరమ్మతులు చేస్తుంటారు.
మత్స్యకారులు:
కమర్షియల్ ఫిషింగ్ అత్యంత ప్రమాదకరమైన వృత్తులలో ఒకటి. తరచూ మారుతూ ఉండే సముద్రంలోని పరిస్థితులను తట్టుకొని ఎక్కువ గంటలు వీళ్లు పనిచేయాల్సి వస్తుంది.
ఎయిర్‌క్రాఫ్ట్ పైలట్లు-ఫ్లైట్ ఇంజనీర్లు:వందలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేరాల్చిన బాధ్యత వీరిదే. ఈ ఉద్యోగాలు అంత సులువు కాదు.