పాము కాటుకు గురైనప్పుడు  తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

 పాములను చూడగానే కొంతమంది జనాలు భయపడుతుంటారు.

ఎందుకంటే పాము కాటు వేస్తే చనిపోతామని భయపడుతుంటారు. 

పాము కాటు వేసినప్పుడు ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలుసుకుందాం. 

ప్రమాదవశాత్తు పాము కాటుకు గురైనప్పుడు ఆ వ్యక్తి టెన్షన్  పడకుండా చూసుకోవాలి.

శరీరాన్ని ఎక్కువగా కదపకూడదు. పరిగెత్తకూడదు.

ఇలా చేస్తే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.

అప్పుడు విషం వేగంగా శరీరమంతా వ్యాపిస్తుంది. అందుకే టెన్షన్ పడకుండా ధైర్యంగా ఉండాలి.

పాము కాటు వేసినప్పుడు ఒంటరిగా ఉంటే, వెంటనే 108కు ఫోన్ చేయాలి.

చుట్టూ ఉన్న వ్యక్తుల సహాయం తీసుకోవాలి.. వీలైనంత త్వరగా ఆసుపత్రికి వెళ్లాలి. 

పాము కాటువేసిన గాయం చుట్టూ టేపు లాంటిది కూడా కట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలి.