ఆడ పెంగ్విన్స్ గుడ్లు పెట్టిన తర్వాత ఆహార వేట కోసం వెళ్లిపోతాయి. ఆ సమయంలో గుడ్లను మగ పెంగ్విన్స్ చూసుకుంటాయి.
గుడ్లను తమ శరీరంతో కప్పేసి వెచ్చగా ఉండేలా చూసుకుంటాయి. ఒక వేళ ఆహార వేట నుంచి తల్లి తిరిగి వచ్చేలోగా.. గుడ్లు పొదిగితే తండ్రే వాటికి ఆహారం పెడతాడు.
ఆడ సీహార్స్.. మగ సీహార్స్ పౌచ్‌లో గుడ్లను పెడుతుంది. ఆ గుడ్లను మగ సీహార్స్ తన పౌచ్‌లో ఓ నెలపాటు మోస్తుంది. వందలాది పిల్లల్ని కంటుంది.
గోరిల్లాల జాతిలో తండ్రులే కుటుంబానికి నాయకులు. ఆ తండ్రి గోరిల్లాలే కుటుంబానికి ఆహారం తెచ్చి పెట్టాలి
కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలి. పిల్ల గోరిల్లాలు పెరిగి పెద్దవి అయ్యే వరకు తండ్రి గోరిల్లా వాటికి రక్షణగా ఉంటుంది.
ఆడ సింహాలు వేటకు వెళ్లి ఆహారం తెస్తే.. మగ సింహాలు తిని పెడతాయి. పిల్లల్ని పెంచటంలో మగ సింహాలు ఎంతో నేర్పుగా.. ఓర్పుగా ఉంటాయి.
ప్రమాదాల నుంచి పిల్లల్ని ఎలా సురక్షితంగా ఉంచాలో వాటికి తెలుసు. అంతేకాదు.. పిల్ల సింహాలు ఎలా బతకాలో తండ్రినుంచే నేర్చుకుంటాయి.
మగ ఎర్ర నక్కలు పిల్లల్ని క్షేమంగా ఉంచటంతో పాటు జీవిత పాఠాలు కూడా నేర్పిస్తాయి.
పిల్ల నక్కలు కొంచెం పెద్దగా అవ్వగానే .. తండ్రి వాటితో కలిసి ఆడుకుంటాడు. ఎలా ఆహారం సంపాదించాలో నేర్పిస్తాడు.
Related Web Stories
మీరు వాడుతున్న టీ పొడి స్వచ్ఛమైనదేనా? లేక కల్తీదా? ఇలా చిటికెలో తెలుసుకోండి..
ఉప్పుతో బ్రష్ చేయడం వల్ల లాభాలు తెలిస్తే మైండ్ బ్లాక్ అంతే..
ఈ టీ తాగితే పళ్లు పుచ్చిపోవు..
ఈ ప్రదేశాలు గురించి తెలుసా.. వర్ష కాలంలో భూతల స్వర్గాలు ఇవి..