చదివింది మర్చిపోతున్నారా..  ఇవిగో మెమొరీ టిప్స్‌!

చదివే ప్రదేశాన్ని నిశ్శబ్దంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉంటే మీ దృష్టిని పూర్తిగా చదివే అంశం మీదే కేంద్రీకరించడానికి వీలవుతుంది.

పదాల్లోని మొదటి అక్షరాన్ని గుర్తుంచుకుంటే మొత్తం పదం, ఆ తర్వాత సంబంధిత వాక్యం వెంటనే గుర్తొచ్చే అవకాశం ఉంటుంది.

పాఠాలను ఎప్పుడూ పరీక్షల దృష్టితోనే చదవకండి. ఇష్టంగా చదివితే నేర్చుకోవడం ఎప్పుడూ కష్టంగా ఉండదని తెలుసుకోండి

ప్రతి పాఠంలోని ముఖ్యాంశాలతో నోట్సు రాయడాన్ని అలవాటు చేసుకోండి. పరీక్షల ముందు వీటిని ఒకసారి చదువుకుంటే ఒత్తిడికి గురికాకుండా ఉంటారు.

చదివిన దాన్ని ఎప్పటికప్పుడు రీకాల్ చేసుకోవాలి. కేవలం పరీక్షల్లోనే కాకుండా సాధారణ సమయాల్లోనూ ఇలానే చేస్తుండాలి

ఎప్పుడూ ఒకేచోట కూర్చుని చదవడం వల్ల ఒక్కోసారి కాస్త విసుగ్గా అనిపించొచ్చు. చదివే ప్రదేశాన్ని అప్పుడప్పుడూ మారుస్తుండాలి

మెదడు చురుగ్గా పని చేయాలంటే జీవనశైలి సరిగ్గా ఉండాలి. పదింటిలోపే పడుకోవాలి. ఉదయం ఐదింటికల్లా నిద్రలేవాలి.