వంట నూనె విషయంలో తనిఖీ
చేయవలసిన 3 ముఖ్యమైన విషయాలు..
వంట నూనె కొనే ముందు తప్పనిసరిగా మూడు విషయాలు చెక్ చేయాలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
వంట నూనె ప్రతిఒక్కరి జీవితంలో అతి ముఖ్యమైంది. అయితే కొంతమంది తక్కువ ధరకు వస్తాయి కదా అని ఏదిపడితే అది కొంటుంటారు.
వంట నూనె కొనే ముందు మూడు విషయాలను తనిఖీ చేయడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఒక వ్యక్తి ఒక రోజులో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువ నూనె వాడకూడదని హెచ్చరిస్తున్నారు.
వంట నూనె కొనే ముందు గమనించాల్సిన మొదటి విషయం అది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అవునో కాదో చెక్ చేయడం.
ఈ ఆయిల్స్‌ని హీట్ చేయకుండానే తయారు చేస్తారు. అంతే కాదు వీటిలో కెమికల్స్ కూడా ఉండవు.
ఈ నూనెతో వంట చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొలెస్ట్రాల్ సమస్య కూడా రాదు.
వంట నూనె కొనే ముందు కచ్చితంగా చెక్ చేయాల్సిన మరో విషయం స్మోక్ పాయింట్ ఆయిల్
నూనె క్వాలిటీగా ఉందా లేదా అనేది దీనిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వంటలన్నింటినీ అధిక వేడి వద్ద వండుకుంటాము.
అలా వండేటప్పుడు నూనె 230 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది. అయితే ఇక్కడే నూనె క్వాలిటీ తెలిసిపోతుంది.
మూడోదిగా.. వంట కోసం ఒకే నూనెపై ఎప్పుడూ ఆధారపడకూడదు. అటువంటి నూనెల్లో పోషకాలు ఉన్నప్పటికీ, అవి మిమ్మల్ని పూర్తిగా ఆరోగ్యంగా ఉంచలేవు.
Related Web Stories
ధనియాలను కూరల్లో వేయండి.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
ఈ విషయాలు ఎప్పుడూ ఎవరికీ చెప్పొద్దు..
సింహాలను కూడా వణికించే.. 7 ప్రమాదకర జీవులివే..
మౌత్‌వాష్ వాడేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు