ఫూల్ మఖానా.. పోషకాల గని.. 

మఖానాలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి అత్యంత ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. 

మఖానాలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా, సోడియం తక్కువగా ఉంటాయి. మఖానా రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

మఖానాలో ఫైబర్ స్థాయులు ఎక్కువగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో మఖానా కీలక పాత్ర పోషిస్తుంది. 

మఖానాలో ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువ స్థాయిలో ఉంటాయి. చాలా సేపటి వరకు ఆకలి వేయదు. 

మఖానాలో కాల్షియం స్థాయులు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. 

శరీరంలో జరిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను మఖానా సమర్థంగా నియంత్రిస్తుంది. 

ఉదయం సమయంలో మఖానా తినడం వల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. 

షుగర్ వ్యాధిగ్రస్తులకు, బరువు తగ్గాలనుకునే వారికి మఖానా ఆరోగ్యకరమైన స్నాక్

మఖానాలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. పోషకాలు ఎక్కువగా ఉంటాయి.