జాగ్రత్త..  ఈ ఫుడ్స్ తింటే నరాల బలహీనత..! 

చెడు జీవనశైలి కారణంగా చాలా మంది నరాల బలహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు.

శీతల పానీయాలు, ప్యాక్ చేసిన ఆహారం నాడీ ఆరోగ్యానికి హానికరం. ఇది మధుమేహం, హై బీపీకి దారితీస్తుంది.

పిజ్జా, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి జంక్ ఫుడ్స్ తో పాటు, ఫాస్ట్ ఫుడ్స్ కూడా నరాలకు హానికరం. 

చక్కెర అధికంగా ఉండే ఆహారాలు బ్లడ్ షుగర్ పెంచి నరాలను దెబ్బతీస్తాయి.

తరచుగా లేదా నిరంతరం మద్యం సేవించడం వల్ల మెదడు, నరాలు దెబ్బతింటాయి.

ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా సాల్మన్, అవిసె గింజలు, వాల్‌నట్లు నరాల ఆరోగ్యానికి మంచివి.

పాలకూర, బ్రోకలీ, బాదం, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ నాడీ బలహీనతను తగ్గించడంలో సహాయపడతాయి.

గుమ్మడికాయ గింజల్లో ఉండే ఇనుము, మెగ్నీషియం, రాగి వంటి పోషకాలు నరాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.