శరీరానికి ప్రోటీన్స్ కావాలనుకునేవారు చాలా మంది గుడ్డును రకరకాలుగా తీసుకుంటుంటారు.
గుడ్డును ఉడికించో లేదా ఆమ్లెట్‌గా తాయరు చేసుకొనో భుజిస్తారు
ఒక గుడ్డు సుమారుగా 72 కేలరీలు, 6 గ్రాముల ప్రొటీన్లు, 5 గ్రాముల ఆరోగ్యకర కొవ్వులు కలిగి ఉంటుందని నిపుణులు అంటున్నారు.
గుడ్డును ఉడకబెట్టి తినడం వల్ల గుడ్డులోని చాలా పోషకాలు కోల్పోకుండా నేరుగా బాడీకి అందుతాయి అన్నది నిపుణుల మాట.
గుడ్డును ఉడకబెట్టడం వల్ల అందులో ఉండే విటమిన్లు B12, D, రిబోఫ్లావిన్‌లు, అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు సులభంగా జీర్ణం అయ్యేట్టు మారతాయి.
ఉడికించిన గుడ్లలో కోలిన్ అనే పోషకం మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడుతుంది.
దీన్ని తినడం అంటే మంచి పోషకాహారాన్ని తీసుకోవడమే.
గుడ్డును ఆమ్లెట్ వేసేటపుడు అదనంగా నూనె లేదా ఇతర పదార్థాలు వాడటం వల్ల కొంత చెడు కొలస్ట్రాల్ కూడా శరీరంలోకి కలుస్తుంది.
Related Web Stories
ఇవి సర్వరోగ నివారిణి..వీటి లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
ఇలాంటి వాళ్లు గ్రీన్ టీకి దూరంగా ఉండాల్సిందే
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
నెలసరి నొప్పులకు.. ఈ గింజలు దివ్య ఔషధం