వేసవిలో శరీరానికి  చల్లదనం, శక్తి అవసరం.

ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు నీరు అధికంగా ఉండే పండ్లు ఎక్కువగా తినమని పోషకాహార నిపుణులు చెబుతుంటారు.

శరీరానికి శక్తి, చల్లదనం కావాలి. వేసవిలో తినదగ్గ పండ్లలో బొప్పాయి ఒకటి

వేసవిలో శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. బొప్పాయిలో 88శాతం నీరు ఉంటుంది.

బొప్పాయితో పాటు, నారింజ, పుచ్చకాయ, ఖర్బూజా, దోసకాయ వంటివి తినమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బొప్పాయిలో ఉండే విటమిన్ A, C, E చర్మానికి తేమ, మెరుపునిస్తాయి. వేసవిలో చర్మం కాంతివిహీనంగా మారుతుంది. బొప్పాయి చర్మానికి టానిక్ లా పనిచేస్తుంది.

రోజూ ఒక గిన్నె బొప్పాయి ముక్కలు తింటే అజీర్తి రాదు. అలాగే, తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉన్న బొప్పాయి కడుపు నిండుగా ఉంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

బొప్పాయి మంచి ఎంపిక అంటున్నారు పోషకాహార నిపుణులు. బొప్పాయిలో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. వేసవిలో బలహీనపడే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది.