పిల్లలు, పెద్దలు ఇష్టపడే ఈ పండు విటమిన్లు, ఖనిజాలతో నిండిపోయి ఉంటుంది.
శరీరానికి అవసరమైన పోషకాలను అందించే ఈ పండు బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపికగా నిలుస్తుంది.
ఈ కాలంలో దాహాన్ని తగ్గించడంలో శరీరాన్ని చల్లబరచడంలో నేరేడు మంచి పాత్రను పోషిస్తుంది.పేగు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది
చక్కెర స్థాయిలను నియంత్రించడంలో రక్తపోటును సమతుల్యంలో ఉంచడంలో కూడా ఇది సహకరిస్తుంది. ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో నేరేడు కీలక పాత్ర పోషిస్తుంది.
నేరేడు పండు ఆరోగ్యానికి మేలు చేస్తుంది కాని దీనిని అధికంగా తినడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి.
ఫైబర్, టానిన్లు అధికంగా ఉండి ఎక్కువగా తినడం వల్ల పేగులపై ఒత్తిడి పెరిగి కడుపు నొప్పి, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. కొంతమందికి జీర్ణక్రియ సమస్యలు కలుగుతాయి. అందువల్ల మితంగా తినడం అవసరం.
నేరేడు విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. చర్మానికి మేలు చేయడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రకాశవంతంగా కనిపించడంలో ఇది ఉపయోగపడుతుంది.