మజ్జిగ దివ్యౌషధం.. వేసవిలో ఇలా చేసుకు తాగితే..
వేసవిలో శరీరానికి అద్భుతమైన చల్లదనాన్ని ఇచ్చే దివ్యౌషధం మజ్జిగ.
మజ్జిగను చాలా పల్చగా చేసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి.
అల్లం, కొత్తిమీర, పొదినా చాలా సన్నగా చేసుకుని అందులో వేసుకోవాలి.
వీటితోపాటు జీలకర్ర పొడి కూడా వేసుకొని వేసవిలో మజ్జిగ తాగాలి.
ఇలా చేసుకుని మజ్జిగ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎసిడిటీని తగ్గిస్తుంది.
బరువు తగ్గడంతోపాటు ఎముకలకు బలాన్ని ఇస్తుంది.
వీటిలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు కిడ్నీలో రాళ్లను నివారిస్తుంది.
దీనిలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కడుపులోని ఆమ్లాన్ని తటస్థీకరించి.. ఎసిడిటీ, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది.
ఇందులో కాల్షియం, పొటాషియం, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి.
ఇందులోని కాల్షియం, ఫాస్పరస్ ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చాలా మంచిది.
మజ్జిగలోకి లాక్టిక్ యాసిడ్.. చర్మంపై మచ్చలను తగ్గించి, కాంతివంతంగా కూడా ఉంచుతుంది.
Related Web Stories
పానకం తాగడం వల్ల ఇంత ఎనర్జీ వస్తుందా..?
ఈ సూపర్ ఫుడ్స్.. మీ లివర్, గట్ హెల్త్‌ను కాపాడతాయి..
రోజూ నూడిల్స్ తింటే.. ఈ సమస్యలు తప్పవు..!
ఈ సూపర్ ఫుడ్స్.. కార్టిసాల్ ఉత్పత్తిని తగ్గిస్తాయి!