ఈ సమస్యలున్నవారు..రొయ్యలు
తింటే ప్రమాదం..
మాంసాహార ప్రియుల్లో సీ ఫుడ్ ని ఇష్టంగా తినేవారు ఉంటారు. ఈ సీ ఫుడ్ లో రొయ్యలను కొందరు చాలా ఇష్టంగా తింటారు.
రొయ్యల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి.. వీటిని తినడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
మెదడు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే రొయ్యలు తినడం కొంతమంది ఆరోగ్యానికి హానికరం
మీకు షెల్ఫిష్ అలెర్జీ ఉంటే రొయ్యలకు దూరంగా ఉండండి. ఇవి సమస్య తీవ్రం అవ్వడానికి కారణం అవుతాయి.
పచ్చి లేదా సరిగ్గా ఉడికించని రొయ్యలు హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లను కలిగి ఉంటాయి.
రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న.. పచ్చి లేదా తక్కువగా ఉడికించిన రొయ్యలను తినకుండా ఉండండి.
రొయ్యలలో సోడియం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రక్తపోటు లేదా ఇతర గుండె జబ్బులు ఉన్నవారు వాటిని మితంగా తీసుకోవాలి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించడం మేలు.
Related Web Stories
వర్షాకాలంలో పసుపు పాలు తాగడం మంచిదేనా?
వేడి పాలు vs చల్లని పాలు ఏవి ఆరోగ్యానికి మంచివి?
గుడ్లలో పోషకాలు ఇవే..
మునక్కాయ తింటే ఇన్ని ప్రయోజనాలా...