వారం రోజుల పాటు బ్రష్ చేయకపోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

రెండో రోజుకు మీ దంతాలపై ప్లేగ్ అనే బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. దీనికి సంబంధించిన బయోఫిల్మ్ ఎనామిల్ చిగుళ్లు వ్యాధితో పాటూ దంతక్షయానికి దారి తీస్తుంది.

బ్రష్ చేసుకోకపోతే ఆహార వ్యార్థాలు, బ్యాక్టీరియా నోటిలోనే ఉండిపోతుంది. దీనివల్ల దుర్వాసన మొదలవుతుంది.

ప్లేగ్ పేరుకుపోవడం వల్ల చిగుళ్లు ఎర్రగా, ఉబ్బినట్లుగా మారతాయి. దీంతో పాటూ రక్తస్రావం కూడా అవుతుంది. 

వారం రోజుల పాటు బ్రష్ చేయకపోతే దంతాలు పసుపు రంగులోకి మారతాయి.

దంతాలపై ఎనామిల్ దెబ్బతింటుంది.

ఎముక, కణజాలాలను దెబ్బతీసే ఇన్ఫెక్షన్, పీరియాంటైటిస్ వంటి చిగుళ్ల వ్యాధులు సంభవిస్తాయి.

నోటిలోని బ్యాక్టీరియా రక్తంలోకి ప్రవేశించి, గుండె సమస్యలకు దారి తీస్తుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.