మైగ్రేన్ తగ్గించటంలో అల్లం బెస్ట్ రెమిడీగా పనిచేస్తుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి వికారం, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
అల్లం టీ లేదా అల్లం ముక్క నమలడం వల్ల ఉపశమనం లభిస్తుంది. లావెండర్ ఆయిల్ వాసన చూడటం లేదా తలకు మసాజ్ చేయడం వల్ల ఈ నొప్పి తగ్గుతుంది.
నుదురు, మెడపై పుదీనా నూనెతో మసాజ్ చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. మెగ్నీషియం లోపం వల్ల మైగ్రేన్ వస్తుంది. కాబట్టి మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
మైగ్రేన్ సమస్య ఉన్న వారు చల్లటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల మైగ్రేన్ సమస్య తీవ్రమవుతుంది.
బెల్లం పాలు తాగడం ద్వారా కూడా నొప్పి తగ్గుతుంది.
మైగ్రేన్ తీవ్రంగా ఉన్నపుడు వేడి పాలలో కొద్దిగా బెల్లం వేసి తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ప్రశాంత వాతావరణంలో విశ్రాంతి తీసుకోవడం వల్ల నొప్పి తగ్గుతుంది. అదేవిధంగా, యోగా, ధ్యానం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.