గుడ్లలో పోషకాలు ఇవే..

గుడ్లలో విటమిన్ B12  సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల నిర్మాణం, నరాల పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది.

కోలిన్ అనేది గుడ్లలో కనిపించే ముఖ్యమైన పోషకం, ఇది మెదడు అభివృద్ధికి, ఆరోగ్యానికి కీలకంగా పనిచేస్తోంది.

గుడ్లలోని విటమిన్ ఏ రోగనిరోధక శక్తి పనితీరు, చర్మ సౌందర్యానికి పనిచేస్తోంది.

గుడ్లలో ఉండే ఫోలేట్, గర్భధారణ సమయంలో పిండం అభివృద్ధికి చాలా ముఖ్యమైంది.

సెలీనియం అనేది గుడ్లలో కనిపించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్.  

గుడ్లలో లుటిన్, జియాక్సంతిన్ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి  మేలు చేస్తాయి.

గుడ్లలో భాస్వరం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచటంలో సాయపడుతుంది.