వేడి పాలు vs చల్లని పాలు  ఏవి ఆరోగ్యానికి మంచివి?

పాలు చల్లగా ఉన్నప్పుడు తాగాలా లేక వేడిగా ఉన్నప్పుడు తాగాలా అనే సందేహం చాలా మందికి ఉంటుంది.

పాలు.. ఆరోగ్యానికి ఎంతో మంచివి.పాలలో విటమిన్లు, ప్రోటీన్లు, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నందున.. పెరుగుతున్న పిల్లలు పాలు తాగాలని చెబుతారు.

పిల్లల ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

వేడిగా లేదా చల్లగా పాలు తాగడం వల్ల వేర్వేరు ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

కొంతమందికి కొన్ని సమస్యలు ఉంటాయి.. అలాంటి సమయాల్లో వారు శరీరానికి ఏది మంచిది అయితే ఆ విధంగా పాలు తాగాలి.

గుండె సమస్యలు ఉన్నవారు చల్లని పాలు తాగాలని నిపుణులు,చెబుతున్నారు

చల్లని పాలు శరీరంలో జీవక్రియను పెంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

వ్యాయామం తర్వాత చల్లని పాలు తాగమని వైద్యులు సలహా ఇస్తున్నారు.

పడుకునే ముందు వెచ్చని పాలు తాగడం చాలా మంచిది. ఎందుకంటే ఇది మంచిగా నిద్ర పోయేందుకు సహాయపడుతుందని వైద్యులు అంటున్నారు.