కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆహారంలో పసుపు  చేర్చడం వల్ల కాలేయ వాపు తగ్గుతుంది.

ఆకు కూరల్లోని క్లోరోఫిల్ కాలేయాన్ని శుభ్రపరచడానికి సహాయపడుతుంది.

వెల్లుల్లి  తీసుకోవడం వల్ల కాలేయంలోని విషాన్ని బయటకు పంపడంతో పాటూ పనితీరు మెరుగుపరుస్తుంది.

బీట్‌రూట్‌లోని యాంటీఆక్సిడెంట్లు కాలేయ నిర్విషీకరణకు సాయపడతాయి.

వాల్‌నట్స్‌లోని ఒమేగా-3 కాలేయాన్ని శుభ్రపరచడంలో దోహదం చేస్తాయి.

గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కొవ్వ విచ్ఛిన్నం అవడంతో పాటూ కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.