రానున్న రోజుల్లో కూడా స్టాక్ మార్కెట్ నష్టాలు తప్పదా..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ టారిఫ్‌ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఏప్రిల్ 7న తీవ్రంగా ప్రభావితమయ్యాయి

భారత్ సహా ఆసియా, ఐరోపా మార్కెట్లు కూడా భారీగా క్షీణించాయి

దీంతో కొన్ని నిమిషాల వ్యవధిలోనే భారత స్టాక్ మార్కెట్లు 45 లక్షల కోట్ల నష్టపోయాయి

ట్రంప్‌ టారిఫ్‌ల వల్ల ద్రవ్యోల్బణం పెరిగి, కార్పొరేట్‌ లాభాలు తగ్గుతాయని నిపుణులు చెప్తున్నారు

ఈ క్రమంలో మాంద్యం ఏర్పడి ఆర్థిక వృద్ధి మందగించేందుకు అవకాశాలు పెరగనున్నాయి

ఇదే సమయంలో ఆర్థిక మాంద్యం ఛాన్స్ 40% నుంచి 60% వరకు ఉందన్న జేపీ మోర్గాన్

ఇప్పటికే 180కి పైగా దేశాలపై 10%కిపైగా సుంకాలు విధించిన ట్రంప్‌ ప్రభుత్వం

ట్రంప్‌ టారిఫ్‌ల కారణంగా స్టాక్ మార్కెట్లలో నెలకున్న అనిశ్చితి

ఈ నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు 13,730 కోట్ల విలువైన ఈక్విటీల విక్రయం

భారత్‌ డీల్‌ కుదుర్చుకోకపోతే ఈ అమ్మకాలు మరింత పెరిగే ఛాన్స్

కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఈ నెలలో ప్రకటించనున్నాయి, దీంతో మార్కెట్లు మరింత ప్రభావం చూపించనున్నాయి