ఆరోగ్య  బీమా రూ.50 లక్షలు పెంచాలి..టాపప్ మంచిదా, కొత్తది తీసుకోవాలా

మీకు ఇప్పటికే రూ.5 లక్షల  హెల్త్ పాలసీ ఉండి, రూ.50 లక్షలు పెంచుకోవాలనుకుంటే ఇలా చేయండి

టాపప్‌ పాలసీ ద్వారా మీరు దీనిని సులభంగా పెంచుకోవచ్చు

అందుబాటులో ఉండే ధరల్లో పెద్ద కవరేజ్‌ను పొందడానికి టాపప్‌ మంచి ఛాయిస్

మీ ప్రాథమిక పాలసీ ఉన్న బీమా సంస్థలోనే టాపప్‌ తీసుకుంటే ఖర్చులు తగ్గుతాయి

లేదంటే కొత్తగా మళ్లీ పాలసీ తీసుకుంటే మీకు ఖర్చు ఎక్కువ అయ్యే ఛాన్సుంది

ఒకవేళ మీకు ఆ సంస్థలో తక్కువ సౌకర్యాలు ఉంటే, మీరు కొత్త కంపెనీకి వెళ్లడం మేలు

ఆయా బీమా కంపెనీని బట్టి పాలసీలో సౌకర్యాలు మారుతుంటాయి

కాబట్టి పాలసీ తీసుకునే క్రమంలోనే ఆయా సౌకర్యాల గురించి పరిశీలన చేసుకోవాలి

చిన్న ఖర్చులతో పెద్ద రక్షణ పొందేందుకు, టాపప్‌ పాలసీ సరిగ్గా ఉపయోగపడుతుంది

తద్వారా ఆసుపత్రి ఖర్చుల నుంచి మీకు మరింత రక్షణ పెరుగుతుంది