పైసా లేనిదే ఏ పని జరగడం  లేదు అనేది వాస్తవం.

ప్రస్తుతం ప్రతి చిన్న అవసరానికి డబ్బు అనేది తప్పనిసరి అయిపోయింది

ఇక కొంత మంది ఎక్కువగా వర్క్ చేస్తూ డబ్బులు కూడబెడుతుంటారు.

ముఖ్యంగా  చేతిలోకి లక్షల డబ్బులు వచ్చినా.. వాటిని పొదుపు చేయలేరు. వచ్చిన డబ్బు వచ్చినట్లే నీళ్లలా ఖర్చు అయిపోతుంది.

దీంతో చాలా మంది బాధపడుతుంటారు. అసలు మా వద్దకు ఎంత డబ్బు వచ్చినా అది పొదుపు ఎందుకు కావడం లేదు అని బాధపడుతారు.

అలాంటి వారి కోసమే ఈ సమాచారం. మనీ పొదుపు చేయలేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు

ఆలోచించకుండా డబ్బును ఖర్చు పెట్టడం. చేతిలోకి డబ్బు రాగానే సరైన నిర్ణయం లేకుండా చిన్న చిన్న ఖర్చులకు వాడటం వలన డబ్బు పొదుపు చేయలేరంట.

కొంత మంది ఇతరులకు గొప్పగా చూపించుకోవడానికి ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కాగా, దీని వలన సంపద త్వరగా తగ్గిపోతుందంట. డబ్బు నిలవదు.