AI ఎప్పటికీ  చేయలేని 3 ఉద్యోగాలు..

ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) మనం ఆలోచించే, పనిచేసే విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. ఈ రోజుల్లో ప్రజలు Chatgpt, Gemini, Grok వంటి అనేక AI చాట్‌బాట్‌లను ఉపయోగిస్తున్నారు.

మనిషి రోజుల తరబడి చేయగలిగే ఒక పనిని చిటికెలోనే పూర్తిచేయగలదు ఏఐ. తొలిదశలోనే అద్భుతాలు సృష్టిస్తున్న కృత్రిమ మేధ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. 

అన్ని రంగాల్లోకి AI విస్తరిస్తుండంతో.. ఈ   సాంకేతికత కారణంగా తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

AI కారణంగా కొంతమంది భవిష్యత్తులో కచ్చితంగా   ఉద్యోగాలు కోల్పోతారు. కానీ,  మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రకారం ఈ ఉద్యోగాలు ఎప్పటికీ సురక్షితం.  

కోడింగ్, జీవశాస్త్రవేత్తలు, ఇంధన నిపుణుల ఉద్యోగాలకు AI వల్ల ముప్పు లేదు.

మనుషుల సాయం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ డెవలపింగ్, ఇంధన రంగం అభివృద్ధి, జీవశాస్త్రంలో పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణలు చేయలేదు. 

ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో ప్రతి రంగంలో ఏఐ పాత్ర కీలకం కాబోతోంది. దీని సామర్థ్యం మరింత పెరిగే అవకాశముంది.