భారత్‌లో టెస్లా మొదటి షోరూం ప్రారంభ తేదీ ఫిక్స్

ఎలాన్ మస్క్‌ కల ఇప్పుడు ముంబై రోడ్లపై పరుగులు తీయబోతోంది

ఎట్టకేలకు జూలై 15న భారత్‌లో తన తొలి షోరూం అధికారికంగా మొదలు కానుంది

దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని జియో వరల్డ్‌లో ఈ షోరూం ప్రారంభమవుతుంది

బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 4,000 చ.అ. విస్తీర్ణంలో ఇది మొదలు కానుంది

ఈ ప్రాపర్టీస్‌తో ఐదేళ్ల లీజు ఒప్పందం ఫిబ్రవరిలో రిజిస్టర్ అయింది

చైనాలోని షాంఘై ఫ్యాక్టరీ నుంచి మోడల్ వై కార్లు ఇప్పటికే ముంబైకి చేరుకున్నాయి

విదేశీ దిగుమతులపై ఉన్న సుంకాలు గతంలో అడ్డుగా ఉండగా, ఇప్పుడు అనుకూలం

దేశంలో డిమాండ్ ఆధారంగా ఢిల్లీ తదితర నగరాల్లో మరిన్ని షోరూమ్లు రానున్నాయి

పన్నులు, బీమా కలిపితే మోడల్ వై ధర దాదాపు రూ. 48 లక్షలు