ఫుడ్‌ డెలివరీలోకి.. టాటా గ్రూప్‌ బిగ్‌బాస్కెట్‌ కూడా..

టాటా గ్రూప్‌ అధీనంలోని బిగ్‌బాస్కెట్‌ సేవల విస్తరణలో కొత్త నిర్ణయం తీసుకుంది

బెంగళూరులో 10 నిమిషాల్లో ఫుడ్‌ డెలివరీ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించింది

టాటా కన్స్యూమర్, స్టార్‌బక్స్ సంయుక్త సంస్థ నుంచి ఆహార పదార్థాలు డెలివరీ చేస్తున్నారు

అంతేగాక, టాటా గ్రూప్‌ IHCL సంస్థకు చెందిన Qmin ప్లాట్‌ఫాం ద్వారా ఫుడ్‌ డెలివరీ చేస్తోంది

కాఫీ, టీ, జ్యూస్‌, స్నాక్స్‌, మీల్‌బౌల్స్‌, డెసర్ట్స్‌ ప్రస్తుతం డెలివరీ చేస్తున్నారు

Qmin అనేది టాటా హోటల్స్‌ నుంచి ఆహారాన్ని ఆర్డర్‌ చేసేందుకు రూపొందిన యాప్‌

2020లో ప్రారంభమైన ఈ ప్లాట్‌ఫామ్‌ బేకరీకి ప్రత్యేకంగా Qmin కేఫ్ కూడా ఉంది

ప్రత్యర్థులుగా Zepto, Swiggy Snacks, Blinkit Bistroలు ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయి

 వీరంతా తమ మార్కెట్‌ వాటా పెంచుకునేందుకు భారీగా పెట్టుబడులు చేస్తున్నాయి

ప్రత్యేకంగా కిచెన్‌లు ఏర్పాటు చేసి ఫుడ్‌ ప్రిపరేషన్ వేగవంతం చేస్తున్నాయి