రిటైల్‌ ద్రవ్యోల్బణం షాకింగ్.. ఆరేళ్ల తర్వాత..

దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ఠానికి చేరుకుంది

జూన్‌లో సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం 2.10%గా ఉంది

ఆహార ధరలు పడిపోవడం వల్ల ద్రవ్యోల్బణంలో భారీ తగ్గుదల

మేలో 2.8% ఉన్న ద్రవ్యోల్బణం జూన్‌లో 72 బేసిస్ పాయింట్లు తగ్గింది

గతేడాది జూన్‌తో పోలిస్తే ద్రవ్యోల్బణం సగానికి తగ్గింది

2019 జనవరిలో నమోదైన 1.97% తర్వాత ఇదే అత్యల్పం కావడం విశేషం

రిటైల్ ద్రవ్యోల్బణం RBI లక్ష్యం 4% కన్నా వరుసగా 5వసారి తక్కువగా నమోదు

6% గరిష్ఠ పరిమితి కంటే తక్కువగా రావడం ఇది 8వసారి

ఆహార ద్రవ్యోల్బణం జూన్‌లో -1.06%కు పడిపోయింది

మేలో 0.99% ఉన్న ఆహార ద్రవ్యోల్బణం మైనస్‌లోకి చేరింది

గ్రామీణ ద్రవ్యోల్బణం 0.92% వద్ద నిలిచింది