ఏఐ ఆధారిత ఈటీఎఫ్‌ల గురించి తెలుసా మీకు..

ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ETF) అనేవి స్టాక్‌మార్కెట్లో ట్రేడయ్యే పెట్టుబడి సాధనాలు

ఇవి ప్రత్యేకంగా ఓ రంగానికి సంబంధించిన షేర్ల సమాహారాన్ని కలిగి ఉంటాయి

ఏఐ ఆధారిత ఈటీఎఫ్‌లు అంటే, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగంలో పనిచేసే కంపెనీల షేర్లతో కూడిన ఫండ్స్

ఇవి AI, మిషన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, రోబోటిక్స్, ఆటోమేషన్ రంగాల్లోని కంపెనీలలో పెట్టుబడి చేస్తాయి

ప్రస్తుతం AI టెక్నాలజీ అనేది అనేక రంగాలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు

ఫైనాన్స్, హెల్త్‌కేర్, ఆటోమొబైల్, కస్టమర్ సపోర్ట్, మీడియా వంటి విభాగాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది

భవిష్యత్తులో AI ప్రాధాన్యం మరింత పెరిగే అవకాశం ఉంది

కాబట్టి దీనిపై ఆధారపడే కంపెనీలకు అభివృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి

AI ఫోకస్ ఉన్న ఈటీఎఫ్‌ల ద్వారా పెట్టుబడి చేయడం ద్వారా దీర్ఘకాల లాభాలకు ఛాన్సుంది