Severe Cold Grips: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. రోజురోజుకీ పడిపోతున్న ఉష్ణోగ్రతలు
ABN , Publish Date - Nov 15 , 2025 | 08:07 AM
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి రోజురోజుకు పెరుగుతూ పోతోంది. పలు ప్రాంతాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో చలి మైనస్‌లోకి వెళ్లిపోయింది. ఇక, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చలి జనాలను వణికిస్తోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో చలిగాలుల తీవ్రత అధికంగా ఉంది. సంగారెడ్డి, ఆసిఫాబాద్, వికారాబాద్, ఇబ్రహీంపట్నంలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపు ఉంటున్నాయి. జనాల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్, బేగంపేట, చందానగర్, సికింద్రాబాద్,
కుత్బుల్లాపూర్, గాజులరామారం, మల్కాజిగిరి, ఫలక్‌నామా, చాంద్రాయణగుట్ట, మెహిదీపట్నం, హయత్‌నగర్, కార్వాన్, అంబర్‌పేట, గోషామహాల్, కాప్రా, ముషీరాబాద్ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దట్టమైన పొగమంచుతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కోస్తా, రాయలసీమల్లో శుక్రవారం అనేక చోట్ల చలి తీవ్రత కొనసాగింది. తెలంగాణకు ఆనుకుని ఉన్న కోస్తా, ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో దట్టంగా మంచు కురిసింది. అల్లూరి జిల్లాలోని జి.మాడుగులలో ఆరు డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
ఇవి కూడా చదవండి
అమ్మో.. రూ.21.93 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..
భారత్‌లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం