Share News

Poet Andeshrees Demise: అందెశ్రీ మరణం తెలంగాణకు తీరనిలోటు: KCR

ABN , Publish Date - Nov 10 , 2025 | 08:45 AM

ప్రముఖ కవి, 'జయ జయ హే తెలంగాణ..' రాష్ట్ర గీత రచయిత, డా. అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందెశ్రీ మరణంతో శోకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు

Poet Andeshrees Demise: అందెశ్రీ మరణం తెలంగాణకు తీరనిలోటు: KCR
Poet Andeshrees Demise

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మరణంపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో, కవిగా తన పాటలతో, సాహిత్యంతో, కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరనిలోటని కేసీఆర్ అన్నారు. ఉద్యమ కాలంలో అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అందెశ్రీ మరణంతో శోకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.


అకాల మరణం బాధాకరం

అందెశ్రీ మరణంపై తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో సోమవారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అకాల మరణం బాధాకరమని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.


ఇవి కూడా చదవండి

రచయిత అందెశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

దృశ్యం సినిమా స్పూర్తి.. భార్యను చంపి మాస్టర్ ప్లాన్ వేసిన భర్త..

Updated Date - Nov 10 , 2025 | 09:34 AM