Share News

Revanth Congrats Hyderabad Police: హైదరాబాద్ పోలీసులకు సీఎం అభినందనలు

ABN , Publish Date - May 17 , 2025 | 01:00 PM

Revanth Congrats Hyderabad Police: హైదరాబాద్‌ పోలీసులకు అరుదైన గౌరవం లభించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనంద వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీస్‌ నెంబర్‌‌లో నిలవడం గర్వంగా ఉందన్నారు.

Revanth Congrats Hyderabad Police: హైదరాబాద్ పోలీసులకు సీఎం అభినందనలు
Revanth Congrats Hyderabad Police

హైదరాబాద్, మే 17: హైదరాబాద్ పోలీసులకు (Hyderabad Police) అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు లభించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హర్షం వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీస్‌ నెంబర్‌‌లో నిలవడం గర్వంగా ఉందన్నారు. డ్రగ్ ఫ్రీ తెలంగాణ (Drug Free Telangana) కోసం తన కలలను సాకారం చేస్తున్న పోలీసులకు ఎప్పుడు మద్దతుగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎక్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ పోస్ట్ చేశారు.


రేవంత్ ట్వీట్ ఇదే

వివిధ రంగాల్లో ప్రపంచానికి తెలంగాణ రోల్ మోడల్ గాఉండాలన్నది నా ఆకాంక్ష. మాదకద్రవ్యాల నియంత్రణలో 138 దేశాలతో పోటీ పడి ఈ రోజు తెలంగాణ పోలీస్ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని సాధించడం గర్వంగా ఉంది. ఈ ఘనతను సాధించిన హైదరాబాద్ నార్కొటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చీఫ్ సీవీ ఆనంద్‌కు, ఆయన బృందానికి నా ప్రత్యేక అభినందనలు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం నేను కంటున్న కలలను సాకారం చేయడానికి కృషి చేస్తున్న ప్రతి పోలీస్‌కు నేను మద్దతుగా ఉంటాను అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి ట్వీట్ చేశారు.


కాగా.. హైదరాబాద్‌ పోలీసులకు అరుదైన గౌరవం లభించింది. మాదక ద్రవ్యాలపై పోరు, నియంత్రణ, అవగాహన కార్యక్రమాలతో పాటు బాధితుల పునరావాసానికి చేసిన కృషికి గానూ హైదరాబాద్‌ నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌న్యూ)కు ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. దుబాయ్‌లోని పోలీస్‌ ఆఫీసర్స్‌ క్లబ్‌లో నిన్న (శుక్రవారం) నిర్వహించిన వరల్డ్‌ పోలీస్‌ సమ్మిట్‌లో ‘ఎక్సలెన్స్‌ ఇన్‌ యాంటీ నార్కోటిక్స్‌’ అవార్డును పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ అందుకున్నారు. ఈ అవార్డు కోసం మొత్తం 138 దేశాలకు చెందిన పోలీసులు పోటీ పడ్డారు. చివరకు హైదరాబాద్‌ పోలీసులు తొలిస్థానంలో నిలిచి సత్తా చాటారు.

revanth-hyd-police.jpg


ఇవి కూడా చదవండి

Army Jawan Land Dispute: సరిహద్దుల్లో జవాన్.. ఇక్కడ భూమి కబ్జా..

India vs Pakistan: కశ్మీరే పాక్ ఆయుధం.. ఆర్మీ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 17 , 2025 | 04:16 PM