Konda Surekha: ఆలయాల బడ్జెట్‌కు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
ABN , Publish Date - Jul 17 , 2025 | 03:58 AM
దేవాదాయ శాఖ పరిధిలోని పెద్ద ఆలయాల వార్షిక బడ్జెట్‌కు ఇకపై ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఆలయాలకు బడ్జెట్ కేటాయింపుల్లో జరుగుతున్న అక్రమాల కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మంత్రి కొండా సురేఖ ఆదేశం
దేవాదాయ శాఖ పరిధిలోని పెద్ద ఆలయాల వార్షిక బడ్జెట్‌కు ఇకపై ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఆలయాలకు బడ్జెట్ కేటాయింపుల్లో జరుగుతున్న అక్రమాల కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి కొండా సురేఖ ఆదేశాలతో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యార్ మెమో జారీ చేశారు. ఇప్పటి వరకు దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే ఆలయాల వార్షిక బడ్జెట్‌కు.. ఆలయ అధికారుల నుంచి వచ్చే ప్రతిపాదనలకు ఆ శాఖ అధికారులు ఆమోదం తెలిపేవారు. అయితే బడ్జెట్ కేటాయింపులు, మంజూరులో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. దీంతో ఇకపై ఆ తరహా సమస్యలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.