Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, రానాలకు ఈడీ పిలుపు
ABN , Publish Date - Jul 25 , 2025 | 05:22 AM
బెట్టింగ్ యాప్స్ కేసుకు సంబంధించి ప్రకటనల్లో నటించిన సినీనటులు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానాలను ఆగస్టు 11న విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

వచ్చేనెల 11న విచారణకు రావాలని నోటీసు
హైదరాబాద్, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : బెట్టింగ్ యాప్స్ కేసుకు సంబంధించి ప్రకటనల్లో నటించిన సినీనటులు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానాలను ఆగస్టు 11న విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. విజయ్ దేవరకొండకు తొలుత జారీ చేసిన నోటీసులో ఆగస్టు 6న హాజరు కావాలని ఈడీ అధికారులు కోరగా, ఆ రోజున తనకు వీలుకాదని, మరో తేదీ కావాలని విజయ్ ఈడీని అభ్యర్ధించడంతో 11న విచారణకు రావాలని ఈడీ అధికారులు పేర్కొన్నారు.