Badminton Semifinals: వెన్నెల, తన్వికి పతకాలు ఖరారు
ABN , Publish Date - Jul 26 , 2025 | 01:45 AM
తెలుగమ్మాయి వెన్నెల కలగొట్ల, మరో భారత షట్లర్ తన్వీ శర్మ ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో..

ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్‌లో సెమీస్‌కు
సొలో (ఇండోనేసియా): తెలుగమ్మాయి వెన్నెల కలగొట్ల, మరో భారత షట్లర్ తన్వీ శర్మ ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పతకాలు ఖరారు చేసుకు న్నారు. ఈ ఇద్దరు మహిళల సింగిల్స్‌లో సెమీఫైనల్స్ చేరారు. సెమీస్‌లో ఓడినా, కనీసం కాంస్య పతకాలు దక్కుతాయి. హైదరాబాద్‌కు చెందిన వెన్నెల క్వార్టర్స్‌లో 21-18, 17-21, 21-17తో జన్యాపోర్న్ మీపాన్‌థాంగ (థాయ్‌లాండ్)పై గెలిచింది. మరో క్వార్టర్స్‌లో తన్వి 21-19, 21-14తో ఐదో సీడ్ తలిట రమధాని విర్యావాన్ (ఇండోనేసియా)ను ఓడించింది. ఫైనల్ బెర్త్ కోసం సెమీస్‌లో 8వ సీడ్ యిన్ యి కింగ్ (చైనా)తో తన్వి, లూ సి యా (చైనా)తో వెన్నెల తలపడతారు. ఈ టోర్నీ మహిళల సింగిల్స్‌లో ఒకేసారి ఇద్దరు భారత షట్లర్లు సెమీస్ చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఇవి కూడా చదవండి
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News